తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని సీతారాం..

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తొడగొట్టారు. శ్రీకాకుళం జిల్లా బూరుజి మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ వాలంటీర్ల నియామకం కార్యక్రమంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనకి ఎదురైన ఓ అనుభవాన్ని వివరిస్తూ.. ఓ మహిళ మళ్లీ జగన్ కే ఓటేస్తామని తొడగొట్టి చెప్పిందన్నారు. ఆమెను అనుకరిస్తూ తమ్మినేని సీతారాం తొడగొట్టి చూపించారు. ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని, రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ప్రజలు అందుకే గత ఎన్నికలలో చంద్రబాబుకి బుద్ధి చెప్పారని అన్నారు.

ఇదిలా ఉంటె నూతన ఏడాది కానుకగా ఏపీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో ఉదయం నుండే పెరిగిన పింఛన్లు డబ్బులు ఇస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ప్రతి నెలా రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈరోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు. ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. జనవరి 3వ తేదీన సీఎం వైయ‌స్‌ జగన్‌ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని ల‌బ్ధిదారుల‌తో మాట్లాడ‌నున్నారు.