కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

కడప జిల్లాలోని కొండాపురం మండలం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. తిరుమల నుంచి తాడిపత్రికి వెళుతున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగుర్ని ఆస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని హాస్పటల్ కు తరలించారు. మృతులు తాడిపత్రి వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.