వంటిల్లును సర్దుకుంటున్నారా?

గృహాలంకరణ

ఎంత పొందిగ్గా పెట్టుకున్నా, వంటిల్లు మాత్రం త్వరగా గజిబిజిగా మారిపోతుంది.. అన్నీ వంటింటి గట్టుపైకే చేరుతాయి… చూడ్డానికి చిరాకు, ఈసారి ఇలా సర్ది చూడండి..

Kitchen shelves
Kitchen shelves

ముందు ర్యాకుల్లో ఉన్నవన్నీ బయట పెట్టండి.. ఆశ్చర్య పోకండి.. సర్దటంలో మొదటి దశ ఏమున్నాయో తెలుసుకోవటమే .. అలా తెలియాలంటే, అన్నే కాళ్ళ ముందుకు రావాల్సిందే.. ర్యాకులన్నీ శుభ్రం చేసుకున్నాక , సామానులను అత్యవసరం , అవసరం తక్కువ అవసరంగా విభజించుకోండి .

సరుకుల పాకెట్స్ వగైరా ఉంటే డబ్బాలోకి చేర్చేయండి.. గడువు ముగిసినవి పడేయండి. బయటకు తీసిన బ్యాటరీ లు సహా అన్నీ పనిచేస్తున్నాయని అనిపిస్తేనే ఉంచండి.. అత్యవసరం అన్నవి త్వరగా అందేలా, తీసుకోవటానికి అనువుగా వుండే చోట ఉంచండి.. అవసరం అన్న వాటిలోనూ ఎక్కువ ఉంటే రెండు మూడు దగ్గర పెట్టుకొని మిగతావి కదిలించని ప్రదేశంలో మూలగా ఉంచండి..

తక్కువ అవసరం ఉన్నవి… అంటే ఎక్కువ మంది వచ్చినపుడు వండటానికి కావాల్సినవి వగైరా వాటిని పైన పెట్టేయండి.. ఇక కొన్ని ఉంటాయి.. వాటిని వాదం,, తీసేయాలంటే మనసొప్పదు.. వాడిదే లేదనిపిస్తే పక్కన పెట్టేయటమే మంచిది.. వీలైతే ఎవరికైనా ఇచ్చేయచ్చు వేరే గదుల్లో పెట్టగలిగినవి, ఉదాహరణకు స్క్రూ డ్రైవర్ , కత్తెర లాంటి వాటిని స్థానాలు మార్చవచ్చు… సర్దేటప్పుడే ఖాళీ లేకుండా పెట్టొద్దు.. అప్పటికీ ఓపెన్ గానే కనిపిస్తాయి.. తిరిగి పెట్టేటప్పుడు తీసేటప్పుడే సమస్య కొద్దీ రోజులకే మళ్ళీ అంతా గందరగోల స్థితీ.. కాబట్టి ముందుగానే ప్రతి ఆరలోనూ కొత్త స్థలం ఉండేలా చూసుకుంటే గజిబిజికి ఆస్కారం ఉండదు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/category/andhra-pradesh/