98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Govt: Good news for 98 DSC qualified employees

ఏపీ సర్కార్ 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 98 డీఎస్సీ క్వాలిఫైడ్ ఉద్యోగులకు జీవో 27 జారీ చేపట్టారు. 4,537 మందికి కాంట్రాక్ట్ పద్ధతిన రూ.33 వేలు జీతం ఇస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. 1998 డీఎస్సీ అభ్యర్థుల సుదీర్ఘపోరాటం అనంతరం జీవో 27 అభ్యర్థుల్లో సంతోషాన్ని నింపింది. గత జూన్‌లోనే 98 డీఎస్సీ అభ్యర్థులకు టైం స్కేల్‌ ప్రకారం సెకండరీ గ్రేడ్‌ పోస్టుల్లో భర్తీ చేసేందుకు ఫైల్‌ఫై సంతకం చేశారు సీఎం జగన్. దీంతో అక్కడక్కడ చెల్లాచెదురైపోయిన అభ్యర్థులు ఊపిరిపోసుకుని 24 ఏళ్ల తరువాతైన తమకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న కొండంత ఆశతో గత జూలైలో ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నరు.

సీఎం జగన్ ప్రకటనతో విద్యాశాఖ కమిషనర్‌ నుంచి చకచకా కిందిస్థాయి అధికారులకు 98 డీఎస్సీ అభ్యర్థుల వివరాలు అందజేయాలని ఆదేశాలు రావడంతో ఆగ మేఘాలు మీద వివరాలు ఇచ్చారు. గడిచిన 8 నెలలుగా అధికారులు హడావుడి తప్ప ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రతిసారి విద్యాశాఖ సమీక్షలో 98 డీఎస్సీ వారికి త్వరలో ఉద్యోగాలు ఇస్తామని, టైం స్కేల్‌ ఇస్తామని ఫైల్‌పై సీఎం సంతకం చేశారని, కేబినేట్‌లో మాట్లాడుతూ వచ్చారు తప్ప ఆచరణలోకి తీసుకురాలేదు. ఇక ఇప్పుడు జీవో రిలీజ్ చేసి సంతోషాన్ని నింపారు.