ఢిల్లీలో ఆదివారం వరకు విద్యాసంస్థలు బంద్..

పది రోజులుగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు బీబత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వరదలకు వందల ఇల్లులు , బ్రిడ్జ్ లు కొట్టుకపోగా, కోట్లాది నష్టం వాటిల్లింది. ముఖ్యంగా యమునా నది మహోగ్ర రూపం దాల్చడంతో ఢిల్లీకి వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఆదివారం వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విదానాన్ని పాటించాలని సూచించారు. అంతే కాదు రెండు రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫ బంద్ కానున్నట్లు సర్కార్ తెలిపింది. ఢిల్లీలోకి వచ్చే భారీ ట్రక్కులపై నిషేధం విధించామని కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఢిల్లీ వాసులు ఓపికతో ఉండాలని ఒక్కసారి వరద ప్రవాహం తగ్గితే అన్ని పరిస్థితులు సాధారణం అవుతాయని పేర్కొన్నారు.

హర్యానా సహా పొరుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో యమునా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 2 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో గత కొన్ని రోజులుగా భారీ వానలను చవిచూస్తున్నాయని.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని పేర్కొన్నారు. వేలాది మంది ప్రజలను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. గురువారం వరకు యమునా నదిలో ప్రవాహం అధికంగా ఉంటుందని.. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.