వరద నీటిలో చిక్కుకున్న ఢిల్లీ సీఎం ఇళ్లు..

యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీ నగరం వరదలో చిక్కుంది. 45 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరదలకు దేశ రాజధాని వీధులు నదిలా మారాయి. లోతట్టు ప్రాంతాలే కాదు.. ప్రధాన రోడ్లు, ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. ఢిల్లీ సీఎం క్రేజీవాల్ ఇళ్లు సైతం వరద నీటిలో చిక్కుకుంది. సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్‌రోడ్డు మునిగిపోయింది. నీటి స్థాయులు పెరుగుతుండడంతో వజీరాబాద్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును మూసివేశారు.

ఢిల్లీలోని చారిత్రక కట్టడం ‘ఎర్ర కోట’ను కూడా వరద నీళ్లు తాకాయి. యమునా ఘాట్ నుంచి ఎర్రకోటకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయినప్పటికీ అంత దూరం వరద నీళ్లు వచ్చాయంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. ఇంత దూరం వస్తాయని ఊహించని స్థానికులు.. ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట చుట్టూ ఉండే వ్యాపారులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోతున్నారు. ఎర్రకోట దాకా వచ్చిన వరద.. ఇంకెంత దూరం పోతుందనేది ఆందోళనకరంగా మారింది.

మరోపక్క ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఆదివారం వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విదానాన్ని పాటించాలని సూచించారు. అంతే కాదు రెండు రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫ బంద్ కానున్నట్లు సర్కార్ తెలిపింది. ఢిల్లీలోకి వచ్చే భారీ ట్రక్కులపై నిషేధం విధించామని కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఢిల్లీ వాసులు ఓపికతో ఉండాలని ఒక్కసారి వరద ప్రవాహం తగ్గితే అన్ని పరిస్థితులు సాధారణం అవుతాయని పేర్కొన్నారు.