కర్ణాటక లో రోడ్ ఫై తెగిపడిన ఐరన్ పిల్లర్

రోడ్ ఫై వెళ్తుంటే సడెన్ గా కొన్ని అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాల వల్ల అమాయకులు మరణిస్తుంటారు. తాజాగా కర్ణాటక జిల్లాలో రద్దీగా ఉండే రోడ్ ఫై ఐరన్ పిల్లర్ పడిపోయిన ఘటన అందర్నీ భయబ్రాంతులకు గురి చేసింది. హుబ్బలి లో రైల్వే బ్రిడ్జి ముందు ఈ పిల్లర్ ను అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాల ఎత్తును హెచ్చరిస్తూ దీన్ని ఏర్పాటు చేశారు. ఆ ఐరన్ పిల్లర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. పిల్లర్ కూలేందుకు కొద్ది క్షణాల ముందు ఓ వాటర్ ట్యాంకర్ అక్కడి నుంచి వెళ్లింది. కొన్ని బైక్ లు, బస్సు అటువైపే వెళుతున్నాయి. ఇంతలో పిల్లర్ కూలిపోతుండటాన్ని గమనించిన వాహనదారులు ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఒక్క క్షణం అటూ ఇటూగా అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇటీవలే పలు వాహనాలు ఈ ఐరన్ పిల్లర్ ను ఢీ కొట్టడంతో అది బలహీనపడిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతోపాటు నిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్డు వాహనాల రాకపోకల సందర్భంగా వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారినట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.