సౌదీలో 24 గంటలో 1645 కొత్త కేసులు

ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్లడి

corona virus
corona virus

రియాద్‌: కరోనా మహమ్మారి గల్ఫ్‌ దేశాలల్లో విలయతాండవం చేస్తుంది. వైర‌స్‌ సౌదీ అరేబియా, ఖ‌తార్‌, యూఏఈలో తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. మంగ‌ళ‌వారం ఒకేరోజు 1,645 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. వీటిలో అత్యాధిక కేసులు మ‌క్కా(287), దమ్మం(261), జెడ్డా(261), జుబైల్ (217), మదీనా (152)లో న‌మోద‌య్యాయి. ఈ 1,645కేసుల‌తో క‌లిపి సౌదీలో మంగ‌ళ‌వారం నాటికి ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన వారి సంఖ్య 28,656కి చేరింది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు 4,476 మంది బాధితులు కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అలాగే దేశ‌వ్యాప్తంగా 191 మంది ఈ వైర‌స్‌కు బ‌ల‌య్యారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/