జగన్ గెలుపు ధీమా ఫై సెటైర్లు

ఏపీలో రీసెంట్ గా ఎన్నికలు తంతు ముగిసిన సంగతి తెలిసిందే. జూన్ 4 న ఈ ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ప్రస్తుతం రెండు నెలలుగా రెస్ట్ లేకుండా ప్రచారం చేసిన నేతలు ప్రస్తుతం రిలాక్స్ మూడ్ లోకి వెళ్లారు. ఇదే క్రమంలో తమ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాగా సీఎం జగన్ మాత్రం ఐప్యాక్ టీం వద్దకు వెళ్లి ఎన్నికల్లో గెలవబోతున్నామని , గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు సాదించబోతున్నాం అని చెప్పడం ఫై అంత సెటైర్లు , విమర్శలు చేస్తున్నారు. పోలింగ్ ముగియగానే పార్టీ నేతలతో సమీక్ష జరిపో, ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసో అధికారంలోకి రాబోతున్నాం అని చెబితే బాగుంటుంది కానీ ఇలా ఐ ప్యాక్ టీం దగ్గర చెప్పడమేమిటో అని ఆశ్చర్యపోతున్నారు.

అధికారంలోకి తీసుకువచ్చేందుకే కోట్ల రూపాయలు పుచ్చుకొని పనిచేసిన ఐప్యాక్‌కు చెప్పడమేమిటో అర్ధం కావడం లేదని సొంత పార్టీనేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాదు అసలు ఈ ఐప్యాక్‌ వల్లే పార్టీ కి చెడ్డ పేరు వచ్చిందనే వారు కూడా ఉన్నారు. జగన్ సీఎంఅయ్యాక, పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ నేతల కంటే, పార్టీ సీనియర్ల కంటే ఐ ప్యాక్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని వాపోతున్నారు. ఎవరెవరు ఏం మాట్లాడాలనే స్క్రిప్టు ఇచ్చింది కూడా ఐప్యాక్ వాళ్ళే కదా!? అని గుర్తు చేసుకొంటున్నారు. చివరకు పార్టనర్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులుగా వచ్చింది కూడా ఐప్యాక్ వాళ్ళే కదా!? అని సోషల్ మీడియాలో అప్పుడే మీమ్స్ మొదలయ్యాయి. అలాంటి ఐప్యాక్ కు చెప్పకుండా ప్రజలకు చెపుతారా అని కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం జగన్ గెలుపు ఫై ధీమా వ్యక్తం చేసినప్పటికీ ..సొంత పార్టీ నేతల్లో మాత్రం ధీమా అనేది లేదని అంత అంటున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.