వైసీపీ నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలంటూ సుధాకర్‌ విన్నపం

ఏపీలో పోలింగ్ రోజున తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌ చెంపపై కొట్టి గొట్టిముక్కల సుధాకర్‌ దేశ వ్యపథంగా వైరల్ గా మారిపోయాడు. అలాంటి సుధాకర్ ఇప్పుడు వైసీపీ నేతల నుండి ప్రాణహాని ఉందంటూ తనకు రక్షణ కల్పించాలంటూ SP ని కోరుతున్నారు.

గత నాల్గు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని ..తన కుటుంబ సభ్యులకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరారు. దాడి తర్వాత ఎమ్మెల్యపై కేసు పెట్టారు కానీ, చర్యలు తీసుకోలేదన్నారు. మరి సుధాకర్ కు రక్షణ కల్పిస్తారో లేదో చూడాలి.