యూపీలో 35.8 % ; పంజాబ్‌లో మందకొడిగా పోలింగ్

polling in UP
polling in UP

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్‌ నమోదు అయింది. పంజాబ్‌లో ఉదయం 11 గంటల వరకు 17.77 శాతం ఓటింగ్ నమోదైంది.

ఓటేసిన ములాయం సింగ్ యాదవ్:

ఉత్తర ప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు మూలయం సింగ్‌ యాదవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జస్వంత్‌పూర్‌ పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అదే పోలింగ్‌ బూత్‌లో అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/#google_vignette