నిద్రతో ఒత్తిడి మాయం

ఆరోగ్య సూత్రాలు

Sleeping
Sleeping

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మానిసక ఆరోగ్యానికి
కంటినిండా నిద్రెంతగానే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.

మానసిక ఆరోగ్యానికి కంటినిండా నిద్ర ఎంతగానే దోహదపడుతుందని మానిసిక వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

మానసిక ఒత్తిడిని జయించి.ఉత్సాహంగా ఉండాలంటూ రోజూ చక్కగా నిద్రపోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

హాయిగా నిద్రపోవడం వల్ల మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటాయి. అందువల్ల ఒత్తిడి వంటి మానిసక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

రాత్రిపూట ఆలస్యంగా పడుకుని ఉదయాన పొద్దెక్కాక ఆలస్యంగా లేచేవారికన్నా.. రాత్రి త్వరగా పడుకుని తెల్లఆరగానే లేచేవారు ఉత్సాహంగా పనులన్నీ పూర్తిచేసుకుంటారు.

సరైన నిద్ర మనసును శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ఒత్తిడి దరిచేరదని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రతీరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకేసమయానికి నిద్రలేవడం అలవాటు
చేసుకోవాలి. ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవాలి. దీంతో మానసిక, శారీరక సమస్యలు దరిచేరవంటున్నారు పరిశోధకులు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/