ఎండా కాలంలో తక్షణ శక్తి …

ఆహారం – ఆరోగ్యం

మండే ఎండల్లో ఓ గ్లాసు చల్లని చెరకు రసం తాగితే హాయిగా అన్పిస్తుంది.. క్షణాల్లో శరీరం ఉత్తేజిత మవుతుంది.. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలే అందుకు కారణం.. చెరకు రసం వలన కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

చెరకులో పిండి పదార్ధాలు, మాంసకృత్తులతో పాటు పొటాషియం, జింక్ ఫాస్ఫరస్, కాల్షియమ్, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి.. విటమిన్ ఏ, బి, సి కూడా ఎక్కువే… ఇది అలసట, నిస్సత్తువును తగ్గించి తక్షణ శక్తిఅందిస్తుంది.. శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది.. దీనిలోని ఖనిజాలు మనలోని దంతాలు , ఎముకులకు బలాన్ని ఇస్తాయి. మలబద్ధకాన్ని పారదోలుతుంది..

క్రమం తప్పకుండా తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది..దీంట్లోని ఫ్లెవనాయిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ , ఇతర ఫినోలిక్ సమ్మేళనాలు వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి..పీచు సమృద్ధిగా ఉంటుంది.. దీన్ని తాగిన వెంటనే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు.. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి ఎంపిక.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది..నోటి దుర్వాసనను తగ్గించి దంత సమస్యలను నిర్మూలిస్తుంది..

శరీరంలో ప్రోటీన్ స్థాయిలను పెంచుతుంది.. అలాగే మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..కామెర్లు వచ్చినవారికి ఈ రసం మేలు చేస్తుందంటారు.. కాలేయం పనితీరును మెరుగుపరిచి అనారోగ్యానికి కారణమైన పదార్ధాలను బయటకు పంపుతుంది.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/category/telangana/