తాజా హెల్త్ అప్డేట్ : వెంటిలేటర్‌పైనే శరత్ బాబు కు చికిత్స

సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (AIG Hospital)లో జాయిన్ చేసి..చికిత్స అందిస్తున్నారు. శరత్ బాబు హాస్పటల్ లో చేరారనే విషయం తెలిసి అభిమానులు , సినీ ప్రముఖులు అయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హాస్పటల్ వర్గం శరత్ బాబు కు సంబదించిన హెల్త్ అప్డేట్ ను విడుదల చేసారు. ప్రస్తుతం శరత్‌బాబుకు ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్సనందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకున్న శరత్ బాబు… తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించారు. ఈయన ఆసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. హీరోగా శరత్ బాబు తొలిచిత్రం 1973లో విడుదలైన రామరాజ్యం. ఆ తర్వాత కన్నెవయసు చిత్రంలో నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. 2021లో పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌సాబ్‌లో డిసిప్లీన్‌ కమిటీ ఛైర్మన్‌గా కనిపించారు. ఈ ఏడాది బాబీ సింహా లీడ్ రోల్‌లో నటించిన వసంత కోకిల చిత్రంలో నటించారు.