రామ్ చరణ్ ఫై ప్రశంసలు కురిపించిన సముద్రఖని

నటుడిగా , డైరెక్టర్ గా తన సత్తా చాటుకుంటూ వస్తున్న సముద్రఖని..తాజా అల్లు అర్జున్, రామ్ చరణ్ లపై ప్రశంసలు కురిపించారు. తాజాగా సముద్రఖని పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీ తెరకెక్కించారు. గత నెల 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ లో ఉంది. ఈ క్రమంలో ఓ మీడియా సమావేశంలో సముద్రఖని మాట్లాడుతూ..మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు.

రామ్‌చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్‌’‌లో నటించాను. నన్ను బాబాయ్ అని పిలిచేవాడు. ఆ సమయంలో మేమిద్దరం స్నేహితులమయ్యాం. అతడిని నా సొంత కుమారుడిలా భావిస్తా” అని సముద్రఖని అన్నారు. చరణ్‌కు ఏ కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థించే వారిలో తానూ ఉంటానని అన్నారు. చరణ్–ఉపాసన దంపతులకు క్లీంకార పుట్టినప్పుడు మెసేజ్‌ పెట్టానని తెలిపారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ చేంజర్‌’‌ సినిమాలోనూ చరణ్‌తో కలిసి నటిస్తున్నానని చెప్పారు.

ఇక అల్లు అర్జున్‌తో కలిసి ‘అల వైకుంఠపురం’ సినిమాలో నటించానని సముద్రఖని చెప్పారు. బన్నీని తాను అన్బు అర్జున్ అని పిలుస్తానని అన్నారు. ‘‘అన్బు అంటే ప్రేమ అని అర్థం. ఆయన అందరితో ప్రేమగా ఉంటారు. షూటింగ్ సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ బంగారం లాంటి మనసున్న వ్యక్తి” అని ప్రశంసలు కురిపించాడు.