వరుస హిట్ల తో దిల్ రాజు కు డబ్బే డబ్బు

టాలీవుడ్ చిత్రసీమలో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ , డిస్ట్రబ్యూటర్ అంటే ఎవరైనా దిల్ రాజు పేరే చెపుతారు. సినిమాలు చేయడంలోనే కాదు డిస్ట్రబ్యూట్ చేయడంలోనూ దిల్ రాజు దిట్ట. అందుకే దిల్ రాజు అంత బాగా నమ్ముతారు. తాజాగా బలగం , దసరా సినిమాలతో భారీగా వెనకేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుండి వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ. 25 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇంకా థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇదిలా ఉండగానే నాని దసరా సినిమా నైజాం రైట్స్ కొనేసిన దిల్ రాజు రెండు రోజులకే లాభాల బాట పట్టినట్టు తెలుస్తుంది. దిల్ రాజు దసరా సినిమాను నైజాం రైట్స్ 9 కోట్లకు కొనేశారట. సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తుంది. సో ఇక నుంచి దసరాకు వచ్చే కలెక్షన్స్ అన్ని దిల్ రాజుకి ప్రాఫిట్స్ కింద లెక్కే. అలా బలగం దసరా రెండు సినిమాలతో దిల్ రాజు సూపర్ ప్రాఫిట్స్ పొందుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలు తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో రావడం విశేషం.