ఏపీలో కొత్తగా 6,952 కరోనా కేసులు

అమరావతి: ఏపీ లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6952 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11,577 మంది చికిత్సకు కోలుకున్నారు. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసులు 18,03,074కు చేరాయి. 16,99,775 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇంకా 91,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 11882 చేరాయి. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 1,08, 616 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/