విపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారుః సజ్జల

సత్తెనపల్లి సభలో వైఎస్‌ఆర్‌సిపి నేతలపై పవన్ ధ్వజం

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

అమరావతిః సత్తెనపల్లి సభలో వైఎస్‌ఆర్‌సిపి నాయకత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించడంపై వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదని అన్నారు. పవన్… చంద్రబాబుకు ఏజెంటులా మాట్లాడుతున్నాడని, ఆయన ఆలోచన అంతా చంద్రబాబు గురించేనని తెలిపారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే పవన్ చదువుతున్నారని విమర్శించారు.

ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, మళ్లీ అధికారంలోకి రాకుండా సీఎం జగన్ ను ఎవరూ అడ్డుకోలేరని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని, మాచర్లను నిప్పుల కుంపటిలా తయారుచేయాలని చంద్రబాబు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు

తాజా జాతీమ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/