సలహాదారు పదవికి రాజీనామా చేసిన సజ్జల

ys-jagan-to-extend-govt-advisors-tenure

ఎన్నికల ఫలితాలు ఆలా వచ్చాయో లేదో రెండో రోజు ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. సజ్జలతో పాటు మరో 20 మందికి పైగా సలహాదారులు రాజీనామా చేశారు. వారు తమ రాజీనామా పత్రాలను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

సహజంగా ఫలితాల సరళి తెలిసిన మరుక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడం ఆనవాయితీ. కానీ సజ్జల మాత్రం తాపీగా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సజ్జల రాజీనామా లేఖను ఒకరోజు తర్వాత పంపడంపై చర్చ సాగుతోంది. మిగిలిన సలహాదారులు ఎప్పటికి చేస్తారని రాజకీయవర్గాలు నిలదీస్తున్నాయి. వై నాట్ 175 అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ చివరకు 11 స్థానాలు కైవసం చేసుకొని దారుణమైన ఫలితాన్ని మూటకట్టుకుంది.