స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్ర లేదని నేను ఇప్పటికీ చెప్పగలను: మల్లికార్జున్ ఖర్గే

ఖర్గే క్షమాపణ చెప్పాలన్న బిజెపి .. తగ్గేదేలే అంటున్న ఖర్గే.. రాజ్యసభలో రభస

Mallikarjun Kharge

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ: భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రాణ త్యాగాలు చేసిందని, దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ తమ ప్రాణాలను అర్పించారని.. బిజెపికి మాత్రం స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేదని, దేశం కోసం బిజెపి నేతల ఇళ్లలో కనీసం కుక్క కూడా చావలేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే వ్యాఖ్యానించారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా సోమవారం రాజస్థాన్‌లోని అల్వార్‌లో మాట్లాడిన ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఖర్గే వ్యాఖ్యలపై ఇవాళ రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన ఖర్గే తమకు క్షమాపణ చెప్పాలని బిజెపినేతలు డిమాండ్‌ చేశారు. కేంద్రమంత్రులు పీయూష్‌ గోయెల్‌, కిరణ్‌ రిజుజు, ప్రహ్లాద్‌ జోషి ఖర్గే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయినా ఖర్గే మాత్రం అదరలేదు, బెదరలేదు.

బిజెపి నేతలు ప్రస్తావిస్తున్న వ్యాఖ్యలు తాను పార్లమెంట్‌లో చేయలేదని, పార్లమెంట్‌ బయట తాను చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదని అన్నారు. బిజెపి నేతలకు ప్రతి దానికి క్షమాపణ అడగటం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. తాను సభ బయట చేసిన వ్యాఖ్యలను సభలో కూడా చేశానంటే వాళ్లు (బిజెపి నేతలు) మరింత ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని రాజ్యసభ చైర్మన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేలేదని, ఇప్పటికీ తాను ఆ వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఖర్గే చెప్పారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలోగానీ, ఐక్యతలో గానీ బిజెపి నేతల పాత్ర ఏముందని ప్రశ్నించారు. దేశం కోసం బిజెపి నుంచి ఎవరు ప్రాణ త్యాగాలు చేశారని నిలదీశారు. దేశ కోసం పోరాడిన వాళ్లను ఈ మాఫీ మాంగ్‌నే వాలే లోగ్‌ (బిజెపి నేతలు) క్షమాపణ కోరడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిం