పంజాబ్ లో ప్రమాణం చేసిన 10 మంది ఆప్ ఎమ్మెల్యేలు

వెంటనే సచివాలయంలో బాధ్యతల స్వీకరణ

చంఢీఘ‌డ్‌: నేడు పంజాబ్‌లో ప‌ది మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. అనంతరం పంజాబ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న తొలి కేబినెట్ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు సార్లు దీర్బా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హర్పాల్ సింగ్ చీమా, మాలౌత్ నుంచి గెలుపొందిన బల్జీత్ కౌర్, జాందియాల ఎమ్మెల్యే హర్భజన్ సింగ్ ఈతో, మాన్సా ఎమ్మెల్యే విజయ్ సింగ్లా, భోవా ఎమ్మెల్యే లాల్ చంద్ కటారుచక్, బార్నాలా ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మీత్ హాయర్, అజ్నాలా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధలివాల్, పాటి ఎమ్మెల్యే లాల్ జిత్ సింగ్ భుల్లార్, హోషియార్ పూర్ ఎమ్మెల్యే బ్రహ్మ శంకర్ జింపా, ఆనంద్ పూర్ సాహిబ్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు.

కొత్త కేబినెట్ లో హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రి కావడం విశేషం. ఒకే ఒక్క మహిళకు ప్రస్తుతం చోటు లభించింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా కేబినెట్ లో 18 శాఖలున్నాయి. మూడు రోజుల క్రితం విప్లవవీరుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖాట్కర్ కలాన్ లో సీఎంగా మాన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఇప్పటివరకు 11 మంది కేబినెట్ లో కొలువుదీరినట్టయింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/