తీన్మార్ మల్లన్న ముందంజ

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల మ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్లో తీన్మార్ మల్లన్నకు 36,210, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 9109 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. సాయంత్రం 3 గంటలక వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలుకట్టడానికే సరిపోయింది.

ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దీంతో జంబో బ్యాలెట్ పేపర్ వాడారు. ఇది కూడా కౌంటింగ్ లేట్ కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్సీకి కౌంటింగ్ కు సంబంధించి గురువారం సాయంత్రానకి పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఒక వేళ రెండో ప్రధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మొత్తం 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 50 శాతం కన్నా ఒక్క ఓటు ఎక్కవ ఎవరికి వస్తే వారు విజయం సాధించినట్లు అవుతుంది.