పొత్తుల కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారుః సజ్జల

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

అమరావతిః పొత్తుల కోసం చంద్రబాబు నానా పాట్లు పడుతున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాట్లు చూస్తుంటే టిడిపి ఎంత బలహీనంగా ఉందో… వైఎస్‌ఆర్‌సిపి ఎంత బలంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు పూర్తి నిరాశ, నిస్పృహలో ఉన్నారని… అంతా అయిపోయిందని చెప్పారు. పొత్తే శరణ్యం అంటూ చివరి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఒకవైపు బిజెపితో ప్రయత్నాలు చేస్తూనే ఇంకోవైపు కాంగ్రెస్ ను లైన్ లో పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు మాటలనే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు.

షర్మిల, పవన్ కల్యాణ్ లు చంద్రబాబు కోసం పని చేస్తున్నారని సజ్జల విమర్శించారు. బిజెపితో పొత్తు కుదరకపోతే… కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా… వైఎస్‌ఆర్‌సిపి మాత్రం సింగిల్ గానే పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ఘన విజయం సాధిస్తుందని, జగన్ రెండోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత టిడిపి, జనసేన పార్టీలు కనిపించకుండా పోతాయని చెప్పారు.