ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్

రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నిఘా ఏర్పాటుచేశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్ట్ యాక్షన్ టీమ్ కదలికలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. గోదావరి తీర ప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హిట్ లిస్ట్‌లో ఉన్న నేతలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ కేంద్రాలను పోలీసు బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.