బీజేపీ బండి సంజయ్‌పై కేసు నమోదు

హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులపై దాడి, విధులకు ఆటంకం, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారంటూ కరీంనగర్‌ టూటౌన్‌ పీఎస్‌లో కేసులు పెట్టారు. ఆయతో పాటు మరో 12 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందు చేశారు. రాష్ట్రంలో ధర్నాలు, దీక్షలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ప్రభుత్వం, కోర్టు ఆదేశాలను బండి సంజయ్ పాటించలేదన్న కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ.. కోర్టు ఆదేశాలు అమలుచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. పోలీసుల నోటీస్‌ను బండి సంజయ్ పట్టించుకోలేంటున్నారు సత్యనారాయణ. బండి సంజయ్‌ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి.. దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి తరలించారు. తమ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని అంతకు ముందు బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/