జగన్‌తో భేటీ అనంతరం సజ్జల ఏమన్నారంటే..

ముఖ్యమంత్రి జగన్ బుధువారం సాయంత్రం క్యాంపు ఆఫీస్ లో నేతలతో సమావేశమయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ సమావేశమ్ జరిగింది. ఈ సమావేశం అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం కార్యాచరణ నిర్దేశించారు. ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు వారంలో 2,3 రోజులు ప్రజల్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలి. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తాం. ఉద్యోగులపై ప్రభుత్వం పాజిటివ్‌గా ఉంది. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వం బాధ్యత’ అని సజ్జల తెలిపారు.

అంతేకాకుండా ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వందని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఏజండాగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.