ఏపీలో నీటి పన్నుల వసూళ్లపై పవన్ ఆగ్రహం

ఏపీలో నీటి పన్నుల వసూళ్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వానిది అప్రజాస్వామ్యతీరని, గ్రామాల వారీగా టార్గెట్‌ పెట్టి మరీ నీటిపన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. చిన్నసముద్రం అనే చిన్నగ్రామానికి రూ.29 లక్షలు టార్గెట్‌ పెట్టారని విమర్శించారు. 2018 నుంచి లెక్కగట్టి 6 శాతం వడ్డీతో వసూలు చేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి పాలన చేస్తున్నారా?, వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆస్తిపన్ను చెల్లించలేదని గతనెలలో ఇళ్లకు తాళాలు వేశారని గుర్తు చేసారు.

ఇక ఈ పన్నుల బాదుడు ఫై టీడీపీ కూడా మొదటినుండి విమర్శలు చేస్తూనే ఉంది. అంతే కాదు సోషల్ మీడియా లో బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడీపీ సభ్యత్య నమోదు కార్యక్రమంతో పాటు బాదుడే బాదుడుపై సమీక్షా సమావేశం నిర్వహించారు చంద్రబాబు. జగన్‌ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు ఉధృతంగా నిర్వహించాలని టీడీపీ గ్రామ కమిటీలకు పిలుపిచ్చారు. మొత్తం మీద జగన పాలనలో బాదుడే బాదుడు అనేదానిపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.