టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమయంలో వైరల్ గా మారిన కేసీఆర్‌ అరుదైన ఫొటో

టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ రోజు..సోషల్ మీడియా లో కేసీఆర్‌ కు సంబదించిన ఓ అరుదైన ఫొటో వైరల్ గా మారింది. బ‌నియ‌న్ వేసుకుని మంచంపై కూర్చుని ఆంగ్ల దిన‌ప‌త్రిక ద హిందూ పేప‌ర్‌ను చేతుల‌తో ప‌ట్టుకుని ఆస‌క్తిగా చ‌దువుతున్న కేసీఆర్ ఫొటోను టీఆర్ఎస్‌కు చెందిన ఓ నేత ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ సాధ‌న‌కు కేసీఆర్ చేసిన కృషిని ఆయ‌న ఆస‌క్తిక‌రంగా వ‌ర్ణించారు. ఈ ఫోటో చూసి అభిమానులు , కార్య కర్తలు , నేతలు తెగ షేర్ చేస్తూ..కేసీఆర్ కు జై జైలు పలుకుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్లీనరీ సభ జరుగుతుంది. కేసీఆర్ మరోసారి మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాబోయే శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో తెరాస గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయలపై దృష్టిసారించాం అన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలన్నారు. దేశంలో విద్యుత్‌ ఉన్నప్పటికీ ప్రజలకు అందదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సాగునీరు సరిపడ దేశంలో ఉన్నప్పటికీ రైతులకు అందవని అన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్‌లు…టెంట్‌లు కాదన్నారు.

ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్క‌లంగా ఉండ‌గా.. రాష్ట్రాల మ‌ధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. దేశంలో ఎక్క‌డా చూసిన నీటి యుద్ధాలే. దీనికి కార‌ణం ఎవ‌రు. 65 వేల టీఎంసీల నీరు ఉండి కావేరి జ‌లాల‌ కోసం త‌మిళ‌నాడు – క‌ర్ణాట‌క మ‌ధ్య‌ యుద్ధం, సింధూ – స‌ట్లెజ్ జ‌లాల కోసం రాజ‌స్థాన్ – హ‌ర్యానా మ‌ధ్య యుద్ధం ఏర్ప‌డింద‌న్నారు.