సామీ..సామీ అంటూ దండాలు పెట్టించిన రష్మిక

పుష్ప నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ వచ్చి అదరగొట్టగా..అక్టోబర్ 28 న మూడో పాట విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూడో సాంగ్ కు సంబదించిన ప్రోమో ను విడుదల చేసి సాంగ్ ఫై ఆసక్తి పెంచారు. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్లున్నాదిరా సామీ.. నా సామీ.. సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది సామీ.. నా సామీ..’ అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ కు భిన్నంగా కాస్త ఫోక్ టచ్ తో ఈ పాట సాగింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. సింగర్ మౌనిక యాదవ్ హుషారుగా ఆలపించారు. తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ..డిసెంబర్ 17 న మొదటి పార్ట్ విడుదల కాబోతుంది.

YouTube video