సచిన్ చేతుల మీదగా జెర్సీ అందుకుని హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేసిన ప్రధాని

Sachin Tendulkar presents a Team India jersey to PM Modi in Varanasi

లక్నోః ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఇక్కడి గంజారి ప్రాంతంలో జరిగిన భూమి పూజ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బీసీసీఐ కార్యదర్శి జై షా, మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, రవి శాస్త్రి తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ ప్రధాని నరేంద్ర మోడీకి టీమిండియా జెర్సీ బహూకరించారు. ‘నమో’ అని రాసి ఉన్న ఆ ప్రత్యేకమైన జెర్సీని సచిన్ చేతుల మీదుగా అందుకున్న మోడీ హర్షం వ్యక్తం చేశారు.