కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ట్రైలర్ విడుదల

కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రం తాలూకా ట్రైలర్ విడుదలైంది. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కళ్యాణ్ రామ్..ప్రస్తుతం బింబిసార అనే హిస్టారికల్ సినిమాతో అలరించడానికి సిద్దమవుతున్నాడు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ వశిష్ట్ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ మూవీ గా రానున్న ఈ చిత్రం నుండి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్నా?’ అని ఓ బాలుడు ప్రశ్నించగా.. ‘ఓ మహా చక్రవర్తి బింబిసారుడు ఏలిన రాజ్యానికి’ అని తండ్రి చెప్పే వాయిస్ ఓవర్ తో ‘బింబిసార’ ట్రైలర్ ప్రారంభమైంది. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ‘బింబిసారుడంటే మరణశాసనం’.. ‘ ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’.. లాంటి పవర్​ఫుల్​ డైలాగ్స్​తో ట్రైలర్​ ఆద్యంతం ఆకట్టుకుంది. రెండు వేర్వేరు టైమ్ లైన్ లో గతంలోనూ మరియు వర్తమానంలోనూ నడుస్తున్నట్లు సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఈ రెండిటినీ ఎలా కనెక్ట్ చేసారనేది ఆసక్తికరం.

ఇక ఈ మూవీ లో కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్, వారీనా హుస్సేన్ హీరోయిన్లు గా నటించగా.. వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ , శ్రీనివాస రెడ్డి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. మరి మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.