నేటి నుండి భక్తులకు దర్శనమివ్వనున్న అయ్యప్ప

రోజుకు 1000 మంది భక్తులకే అనుమతి

నేటి నుండి భక్తులకు దర్శనమివ్వనున్న అయ్యప్ప
sabarimala-temple

కేరళ: కేరళలోని శబరిమల తలుపులు తెరచుకున్నాయి. రెండు నెలల పాటు జరిగే మండల మకరవిలక్కు సీజన్ కోసం తంత్రి కందరారు రాజీవర్ సమక్షంలో మేల్ శాంతి ఏకే సుధీర్ నంబూద్రి, నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అయ్యప్ప గర్భగుడి తలుపులను తెరిచారు. ఈ సంవత్సరం ఎన్నిక కాబడిన శబరిమల మేల్ శాంతి వీకే జయరాజ్ పొట్టి, మాలికాపురం మేల్ శాంతి ఎంఎన్ రాజ్ కుమార్ లు తొలుత 18 మెట్లను ఎక్కి, ప్రత్యేక పూజలు చేశారు. నేటి సాయంత్రం కొత్త మేల్ శాంతి పూజారులు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక రోజుకు 1000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని, అది కూడా వర్చ్యువల్ క్యూ సిస్టమ్ ద్వారా టికెట్లను బుక్ చేసుకున్న వారికి మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. దర్శనానికి 24 గంటల ముందు కొవిడ్19 నెగటివ్ సర్టిఫికెట్ ను కూడా తప్పనిసరి చేశారు. ఇందుకోసం నీలక్కల్, పంబ బేస్ క్యాంపుల్లో కొవిడ్19 కియాస్క్ లను కూడా ప్రారంభించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/