నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడుకి ఫోన్ చేయనున మోడీ

ఇప్పటికే పుతిన్ తో రెండు సార్లు మాట్లాడిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడమే లక్ష్యంగా రష్యా భీకర యుద్ధం చేస్తోంది. యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మోడీ రెండు సార్లు ఫోన్ ద్వారా మాట్లాడారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చేలా సహకరించాలని పుతిన్ ను కోరారు. మోడీ విన్నపాన్ని గౌరవిస్తూ పుతిన్ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మోడీ ఈరోజు మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ముదిరిన వేళ, ఇప్పటికే ఆ దేశం నుంచి దాదాపు 15 లక్షల మంది వెళ్లిపోయిన తరుణంలో జెలెన్ స్కీకి మోడీ ఫోన్ చేయనుండటం గమనార్హం. మరోవైపు, ఈరోజు హంగేరీ, రొమేనియాల నుంచి కనీసం ఎనిమిది విమానాల ద్వారా 1,500 మంది భారతీయులను వెనక్కి తీసుకురానున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/