మాస్క్‌లు ధరించని వారిపై రూ.2 వేలు జరిమానా

YouTube video
Delhi CM Shri Arvind Kejriwal addressing an Important Press Conference

న్యూఢిల్లీ: ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసులు అధిక సంఖ్య‌లో పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిఎం కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్‌లు ధ‌రించ‌ని వారిపై రూ.2 వేలు జ‌రిమానా విధించ‌నున్నారు. గ‌తంలో రూ.500 ఉన్న ఫైన్‌ను ఏకంగా రెండు వేల‌కు పెంచేశారు. కాగా , సిఎం కేజ్రీవాల్‌ ఈరోజు అఖిల ప‌క్ష పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. మాస్క్ ధ‌రించ‌ని వారికి రెండు వేలు జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు చెప్పారు. ఇంతటి క్లిష్ట సమయంలో అందరమూ కలిసి కట్టుగా మహమ్మారిని ఎదుర్కొందామని అన్ని పార్టీల నేతలకూ విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. కోవిడ్ తో సమాజం ఇబ్బంది పడుతోందని, ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదని తాము విజ్ఞప్తి చేశామని ఆయన వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. రాజకీయాలకు ఇది సమయం కాదని నేను రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశా. జీవితమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. రాజకీయాలను పక్కనపెట్టండి. ప్రజల ప్రాణాలను కాపాడదాం అని నేను విజ్ఞప్తి చేశాను. అని కేజ్రీవాల్ ప్రకటించారు.

మరోవైపు ఢిల్లీలో కేసులు పెరుగుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయార‌ని.. ఇవాళ హైకోర్టు కూడా కేజ్రీ స‌ర్కార్‌కు మొట్టికాయ‌లు వేసింది. దీంతో ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం కొర‌డా రుళుపించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/