నిన్న ఒక్కరోజే హైదరాబాద్ లో రూ. 2 కోట్లు సీజ్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఎక్కడిక్కడే చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న డబ్బును , మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో రెండు కోట్ల నగదు ను సీజ్ చేసారు.

సైబరాబాద్ పరిధిలో ఎస్ఓటీ టీమ్స్ తమ సిబ్బందితో కలిసి 8 ప్రదేశాల్లో దాదాపు కోటి 96 లక్షల రూపాయలను పట్టుకున్నారు. పక్కా సమాచారంతో మనీని సీజ్ చేశారు. ఈ క్రమంలో ప్రతీ ఏరియాలోనూ పోలీసులు భారీ మొహరించారు. కొన్ని ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రయాణికుల బ్యాగులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

బషీరాబాద్‌- 74 లక్షలు, కొత్తూరు పోలీసుస్టేషన్ పరిధి- 34 లక్షలు, మాదాపూర్‌ – 21 లక్షలు, చందానగర్‌- 19 లక్షలు, రాజేంద్రనగర్- 15లక్షలు, నార్సింగ్-11 లక్షలు, బాలానగర్- 5లక్షలు మోకిల పోలీసుస్టేషన్ పరిధిలో ఓ కారులో సోదాలు చేస్తుండగా దాదాపు 15 లక్షలు రూపాయలు పట్టబడ్డాయి.