బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ కి క‌రోనా పాజిటివ్

హైదరాబాద్ : తెలంగాణ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ కి క‌రోనా సోకింది. జ్వ‌రం, జ‌లుబు ఉండ‌టంతో ఆయ‌న క‌రోనా టెస్ట్ ని చేయించుకున్నారు. ఇందులో క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. దాంతో ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో ఉన్నారు.క‌రోనా సోకిన విష‌యాన్ని బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ నిర్ధారించారు. ఆరోగ్యం బాగాలేక‌పోతే డాక్ట‌ర్లు కోవిడ్ టెస్ట్ చేశార‌ని చెప్పారు.

దీంతో క‌రోనా పాజిటివ్ గా తేలింద‌ని అన్నారు. అయితే స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. అయితే తాను కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని హోం ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల త‌నతో కాంటాక్ట్ అయిన వారంద‌రూ కరోనా ప‌రీక్షలు నిర్వ‌హించుకోవాల‌ని అన్నారు. అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌ని ఆకాంక్షించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/