ఆర్ఆర్ఆర్ నటుడు కన్నుమూత

ఆర్ఆర్ఆర్ ఫేమ్ హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్సన్ (58) మృతి చెందారు. ఆర్ఆర్ఆర్ మూవీ లో బ్రిటీష్ గవర్నరుగా నటించిన రే స్టీవెన్సన్ ఉత్తర ఐర్లాండ్‌లోని లిస్బర్న్‌లో 1964వ సంవత్సరంలో జన్మించారు.బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్‌లో చదివిన తర్వాత ఇతను బ్రిటీష్ టెలివిజన్‌లో సంవత్సరాలపాటు పనిచేశారు.

అనంతరం పాల్ గ్రీన్‌గ్రాస్ 1998 నాటి చిత్రం ‘ది థియరీ ఆఫ్ ఫ్లైట్’తో చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు.6 అడుగుల4 అంగుళాల ఎత్తున్న స్టీవెన్సన్ రోమ్ లో రోగ్ టైటస్ పుల్లో పాత్ర పోషించారు. స్టీవెన్‌సన్‌కు ఇటాలియన్ మానవ శాస్త్రవేత్త ఎలిసబెట్టా కరాసియాతో ముగ్గురు కుమారులు ఉన్నారు. అనారోగ్య సమస్యలతో ఈయన మరణించినట్లు తెలుస్తుంది. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. రే స్టీవెన్ సన్ మరణంతో RRR చిత్రయూనిట్ ఆయనకు నివాళులు అర్పించారు. పలువురు హాలీవుడ్, బ్రిటన్ ప్రముఖులు రే స్టీవెన్ సన్ కు నివాళులు అర్పిస్తున్నారు.