బాంబు దాడిలో పుతిన్‌ సన్నిహితుడి కుమార్తె మృతి

russia-president-putins-close-friends-daughter-killed-in-bomb-blast

మాస్కోః రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వ్యూహకర్త అలెగ్జాండర్‌ డుగిన కూతురు కారుబాంబు పేలుడులో మరణించింది. ఈ ఘటన రష్యాలో తీవ్ర కలకలం రేపింది. రష్యన్‌ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్‌ పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు అలెగ్జాండర్‌ డుగిన. ఆయన కుమార్తె కారు బాంబు పేలుడులో మరణించడం మాస్కోను ఉలిక్కిపడేలా చేసింది. మాస్కో సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలెగ్జాండర్‌ డుగిన కుమార్తె కూతురు దార్యా డుగిన్‌ ప్రయాణిస్తున్న కారు మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే ఒక్కసారిగి పేలిపోయింది. ఈ ఘటనలో దార్యా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అలెగ్జాండర్‌ది కావడంతో వాస్తవానికి ఆయననే లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. తండ్రితో పాటు ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అలెగ్జాండర్‌ కూడా ఇదే కారులో ప్రయాణించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. సీసీటీవీ కెమెరాల్లో దార్యా డుగిన్‌ కారు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఉక్రెయిన్‌ ఉగ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని రష్యా ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

కాగా, అధ్యక్షుడు పుతిన్‌కు అలెగ్జాండర్‌ డుగినను సైద్థాంత గురువుగా చెబుతుంటారు. రష్యన్‌ జాతీయవాదాన్ని ప్రచారం చేసే అలెగ్జాండర్‌ ప్రభావం పుతిన్‌ ఆలోచనలపై బలంగా ఉంటుంది. ఉక్రెయిన్‌ మీద దాడిని అలెగ్జాండర్‌ బలంగా సమర్ధిస్తారు. అసలు ఈ దాడి ప్రణాళికే అలెగ్జాండర్‌దని చెబుతుంటారు.. ఈ కారణంగానే ఆయన టార్గెట్‌ అయ్యారని తెలుస్తోంది. ఇక అలెగ్జాండర్‌ దుగిన కూతురు 2ఏ ఏళ్ల దార్యా దుగిన జర్నలిస్టుగా పని చేస్తున్నారు. అమెకు రష్యన్‌ సాంప్రదాయవాదిగా గుర్తింపు ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత అమెరికా విధించిన ఆంక్షల జాబితాలో అధ్యక్షుడు పుతిన్‌తో పాటు అలెగ్జాండర్‌ దుగిన, దార్యా దుగిన పేర్లు కూడా ఉన్నాయి. దార్యా హత్యను పుతిన్‌ సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/