కుటుంబాలు మా జీవితాల్లో కూడా ముఖ్యమైనవే
క్రికెటర్ల కుటుంబాలపై చెలరేగిన వివాదంపై రోహిత్ శర్మ ఆగ్రహం

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ల కుటుంబాల వివాదంపై భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీడియాకు తమ ఫ్యామిలీల గురించి ఎందుకు అంత ఆసక్తి. ఏదైనా ఉంటే తమ గురించి మాత్రమే రాయాలని, ప్రతీ విషయంలో కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ అమూల్యమైన సమయాన్ని తన కుటుంబంతో గడుపుతున్నారు. ఈ విషయం పై స్పందిచిన రోహిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మాతో ఉంటే తప్పేంటి. మా కుటుంబ సభ్యులకు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని వార్తలు రాశారు. మా ఫ్యామిలీల గురించి మీకు ఎందుకు’ అని రోహిత్ మండిపడ్డాడు. ‘ఫ్యామిలీలు మాకు అండగా ఉంటాయి. మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మాతో ఉంటే తప్పేంటి. మా కుటుంబ సభ్యులకు నిర్ణయించిన రోజుల కంటే ఎక్కువ రోజులు మాతో ఉన్నారని వార్తలు రాశారు. మా ఫ్యామిలీల గురించి మీకు ఎందుకు’ అని రోహిత్ మండిపడ్డాడు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/