ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి తప్పుకున్న సానియా

Sania Mirza
Sania Mirza

మెల్‌బోర్న్‌: రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలో టైటిల్ నెగ్గి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడకుండానే తప్పుకుంది. ఉక్రెయిన్ పార్టనర్ నదియా కిచెనోక్‌తో కలిసి ఇటీవలే హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్.. కాలి పిక్కగాయంతో ఇబ్బంది పడుతుంది. గురువారం జిన్‌యున్‌ హాన్‌లిన్‌ జు (చైనా) జోడీతో జరిగాల్సిన మహిళల డబుల్స్ మ్యాచ్ మధ్యలో వైదొలిగింది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి సానియా ఆడాల్సి ఉండగా… ఆమె తప్పుకుంది. దీంతో నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి బోపన్న మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఆడనున్నాడు. హోబర్ట్ టైటిల్ గెలిచి ఆనందంలో ఉన్న నాకు దురదృష్టవశాత్తు ఆ టోర్నీ ఫైనల్లో గాయమైంది. దీంతో మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాను. కానీ ప్రస్తుతంనా గాయం పర్వాలేదు. డబుల్స్‌లో నా ఉత్తమ పెర్ఫామెన్స్ ఇవ్వాలను కుంటున్నాను’అని మిక్స్‌డ్ డబుల్స్ నుంచి తప్పుకున్న అనంతరం సానియా తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/