ఆత్మీయుల్ని దూరం చేసే కోపం

Anger
Anger

అసూయ, ద్వేషం, విరోధం, అవమానం నష్టం, కష్టం, పగ, విసుగు, చింతించడం, నిస్సహాయ, దీనస్థితి మొదలగునవి కోపంలో భాగాలే. ‘తన కోపమే తన శత్రువు. తన శాతమే తనకు రక్ష ఇది అక్షర సత్యమైన వాక్యం. కోపం శత్రువుల్ని తయారుచేస్తుంది. ఆప్తుల్ని దూరం చేస్తుంది. ఆగ్రహం ఆందోళనకు దారి తీస్తుంది. క్రమంగా ఇది యాంగ్జయిటీగా మారుతుంది.

మనిషికి సహనం, శాంతం ఎంత మంచి చేస్తుందో కోపం అంత చెడు చేస్తుంది. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో కోపం రావడం సహజం. అందుకు పరిస్థిలులే కావచ్చు. సందర్భాలే కావచ్చు. మనుషులే కావచ్చు. జీవితంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురైనపుడు ఊహించని అపజయాలు, అవహేళనలు ఎదుర్కొన్నప్పుడు బాగా కోపమొస్తుంది. చిన్నవారు మొదలు మధ్య తరగతి వ్యక్తులు, మహోన్నతమైన వ్యక్తుల జీవితాలలో కూడా ఈ వ్యధలు, వేదనలు, ఆవేదనలు, అవహేళనలలు అవమానాలు తప్పలేదు. కోపాన్ని మాత్రం సయించండి.

జీవితాన్ని నవ్వుల నందనవనం, ఉల్లాసాల ఉద్యానవనం, ఆనందాల ఆహ్లాదనిలయంగా మార్చుకుని హాయిగా జీవించండి. అసూయ, ద్వేషం, విరోధం, అవమానం నష్టం, కష్టం, పగ, విసుగు, చింతించడం, నిస్సహాయ, దీనస్థితి మొదలగునవి కోపంలో భాగాలే. ‘తన కోపమే తన శత్రువు. తన శాతమే తనకు రక్ష ఇది అక్షర సత్యమైన వాక్యం. కోపం శత్రువుల్ని తయారుచేస్తుంది. ఆప్తుల్ని దూరం చేస్తుంది. ఆగ్రహం ఆందోళనకు దారి తీస్తుంది.

క్రమంగా ఇది యాంగ్జయిటీగా మారుతుంది. యాంగ్జయిటీ ప్రశాంతతను ఇవ్వదు. డిప్రెషన్‌కు గురిచేస్తుంది. తరచు కోపగించుకునే వారు త్వరగా డిప్రెషన్‌ పాలిట పడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటుకు కారణాలలో ప్రధానమైంది ఆవేశం, ఆగ్రహం. కోపం పలు సందర్భాలలో మన జీవితాన్నే బలి తీసుకునే ఓ శాపం కోపం ఆత్మీయుల్నే దూరం చేయగల అస్త్రం, కోపం మనల్ని మనమే దహింప చేసుకునే ఓ అగ్నిశిఖ. ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్న సమయంలో వారి మాటల కారణంగా కోపం వస్తుంటే వెంటనే మాట్లాడటం మానివేసి మౌనం వహించాలి.

లేదా టాపిక్‌ మరొకవైపు డైవర్టు చేయాలి. బాగా కోపం వచ్చినపుడు ఎదుటి వారిని ఏదేదో అనేయాలనుకుంటారు. ఏమనాలనుకున్నారో ఆ మాటలు మనసులోనే రికార్డు చేసుకోవాలి. గంట తరువాత ఎదుటి వ్యక్తి ఏమేం తిట్టాలనుకున్నారో మనసులోనే రికార్డు మెసేజ్‌ను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవడానికి ఇది ఉత్తమ మార్గమంటారు. ఆగ్రహం పర్యవసానం ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే దాన్ని తొలిదశలోనే అంతం చేయవచ్చు. జీవితాన్ని హాయిగా జీవించాలి. ఆగ్రహావేశాలకు గురికాకూడదు. కోపం వచ్చినప్పుడు ఈ విషయాన్ని మననం చేసుకుంటే మంచిది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/