టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

మౌంట్ మాంగనుయ్: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్.. ఒకే ఒక్క మార్పుతో గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు. రాహుల్, శాంసన్ ఓపెనర్లుగా రానుండగా.. రోహిత్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మరోవైపు కివీస్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి టిమ్ సౌథి తీసుకున్నాడు. ఇక ఆతిథ్య జట్టు ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో తుది జట్టులోకి రాలేకపోయాడని తాత్కలిక కెప్టెన్ టీమ్ సౌథి తెలిపాడు. ఒకవైపు సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసి కొత్త రికార్డు సృష్టించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుంటే, మరొకవైపు చెత్త రికార్డును తప్పించుకోవడంపై ఆతిథ్య జట్టు కసరత్తులు చేస్తోంది. బ్యాటింగ్ పిచ్ కావడంతో రోహిత్ టాస్ గెలవగానే ఏ మాత్ర ఆలోచించకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, సంజూశాంసన్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ.
న్యూజిలాండ్: టీమ్ సౌథి(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, టామ్ బ్రూస్రాస్, టేలర్, టిమ్ సౌతీ, డరైన్ మిషెల్, సీఫెర్ట్, సాన్‌ట్నర్, కుగ్‌లీన్, బెన్నెట్.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/