యువకుడి ప్రాణాలు తీసిన ఐపీఎల్ బెట్టింగ్

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతుంది..ఈ తరుణంలో క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొంతమంది మ్యాచ్ యూ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే..మరికొంతమంది బెట్టింగ్ లు కాస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఐపీఎల్‌లో బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసుకున్నాడు.

ఫరూక్ నగర్ మండలంలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాశ్ అనే యువకుడు బెట్టింగ్ లో పాల్గొని ఓడిపోయాడు. రాత్రి(మే 17) జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాశ్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో ప్రకాష్ మిత్రులు బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు కట్టేని పరిస్థితిలో ఉన్న ప్రకాశ్ ఏం చేయాలో తెలియక.. మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు ఇక లేడు అని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.