అమెరికాలో భారీగా పెరిగిన కరోనా మరణాలు
ఒక్కరోజులోనే 1480 మంది మృతి
వాషింగ్టన్: అమెరికాలో విజృంభణ కొనసాగుతుంది. కేవలం 24 గంటలలో ఈ వైరస్ కారణంగా ఇక్కడ 1480 మంది మరణిచారు. దీనిని బట్టి అమెరికాలో వైరస్ ఎంత మేర ప్రభావం చూపిస్తుందో తెలుసుకోవచ్చు . ఒక్కరోజులోనే ఇంతమంది మరణించడం ప్రజలలో భయాందోళనలను కలిగిస్తుంది. కాగా ఇప్పటివరకు అమెరికాలో 2,77,828 మందికి ఈ వైరస్ సోకగా.. 7,406 మంది మృత్యువాత పడ్డారు. ప్రజలందరూ భయాందోళనలకు గురి కావద్దు, ప్రతి ఒక్కరు సాదారణ మాస్కులు ధరించండి, ఎన్-95 మాస్కులు ధరించరాదని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఎన్ -95 మాస్కులు అత్యవసర విభాగాల్లో పని చేసేవారికి ఆ మాస్కులు ఉపయోగపడతాయని, అలాగే ప్రతి ఒక్కరు సామాజిక దూరం తప్పకుండా పాటించాలి అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/