కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు సిగ్గు లేదు: ట్విట్టర్ లో షర్మిల ఆగ్రహం

బెడ్లు లేవు..పట్టించుకునే డాక్టర్లు లేరంటూ విమర్శ

YS Sharmila

Hyderabad: కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘’క‌రోనా టెస్టులు లేవు. ఆస్పత్రుల్లో బెడ్లు లేవు. ప‌ట్టించుకొనే డాక్టర్లు లేరు. ఊపిరి నిలిపే ఆక్సిజ‌న్ లేదు. వ్యాక్సిన్ లేదు.. క‌రోనాను ఆరోగ్యశ్రీలో చేర్చే ఆలోచ‌నే లేదు. క‌రోనా రోగుల‌పై క‌నిక‌రం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు సిగ్గు లేదు’’ అని ట్విట్టర్‌లో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/