కేబినెట్ నుంచి ఉద్వాసనకు చర్యలు ?!
భూకబ్జా ఆరోపణలపై నివేదిక- సీఎస్ ను ఆదేశించిన కెసిఆర్!

Hyderabad: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై చర్యలు తీసుకుంటూ మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. .రేపో, మాపో ఆయన్ని కేబినెట్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఈమేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణల నేపథ్యంలో అప్పటి కలెక్టర్ దీనిపై వివరాలు, ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు తెలిసింది.
నాలుగున్నరేళ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలిసింది. ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు, ఈ విషయంపై కొందరు రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
ఇదిలా ఉండగా , మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం సాయంత్రం మీడియాలో వైరల్గా మారింది. ఈ వ్యవహారంపై తనకు అందిన ఫిర్యాదును పురస్కరించుకుని వెంటనే దర్యాప్తు జరిపి నివేదికు జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి రిపోర్టు అందచేయాల్సిందిగా సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/