అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేవీ పల్లి మండలం మఠంపల్లి వద్ద లారీ – తఫాన్ వాహనం ఢీకున్నాయి. తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 11మందికి గాయాలయ్యాయి. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులుగా గుర్తించారు. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లేనని సమాచారం. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సమయంలో తుఫాన్ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.