తెలంగాణ రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ : క్రిస్మస్ పండుగకు ప్రత్యేక రైళ్లు

క్రిస్మస్ సందర్భాంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నరసాపురం నుంచి సికింద్రాబాద్, యశ్వంత్ పూర్‌లకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. నరసాపురం-సికింద్రాబాద్ రైలులో స్లీపర్, ఏసీ క్లాస్ టిక్కెట్ల ఖాళీలు ఉండగా, సికింద్రాబాద్-నరసాపురం రైలులో స్లీపర్ క్లాస్ లో ఆర్‌ఎసీ ఉండగా, ఎసీలో టికెట్లు ఖాళీగా ఉన్నాయి.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- రైలు నెంబర్ 07466 నరసాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు.. ఈనెల 22వ తేదీన నరసాపూర్‌లో సాయంత్రం 6గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటల10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివా, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించనుంది.
- రైలు నెంబర్ 07439 సికింద్రాబాద్ నుంచి నరసాపూర్ వరకు .. ఈ నెల 23వ తేదీ రాత్రి 10గంటల 35 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మీదుగా ప్రయాణించనుంది.
- రైలు నెంబర్ 07687 నరసాపూర్ నుంచి యశ్వంత్ పూర్ వరకు ఈనెల 25వ తేదీన నడవనుంది. ఈ రైలు 25వ తేదీ మధ్యాహ్నం 3గంటల 10 నిమిషాలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10గంటల 50 నిమిషాలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసారావుపేట, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్ జంక్షన్, అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ, హిందూపూర్, యలహంక మీదుగా నడవనుంది.
- రైలు నెంబర్ 07688 యశ్వంత్ పూర్ నుంచి నరసాపూర్ వరకు నడవనుంది. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం 3గంటల50 నిమిషాలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8గంటల 30 నిమిషాలకు నరసాపూర్ చేరుకోనుంది. ఈ రైలు యలహంక, హిందూపూర్, పెనుకొండ, ధర్మవరం, అనంతపూర్, డోన్, నంద్యాల, గిద్దలూరు, మార్కాపూర్, దొనకొండ, నరసారావుపేట, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు మీదుగా నడవనుంది.