బైక్ అంబులెన్స్ నడిపిన ఎమ్మెల్యే రోజా
బైక్ అంబులెన్స్‌లు ప్రారంభించిన రోజా

నగరి: ఎమ్మెల్యే రోజా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రులకు రెండు అంబులెన్స్ బైక్‌లను తన చేతులమీదుగా అందజేసింది. అనంతరం జెండా ఊపి వాటిని ప్రారంభించిన ఎమ్మెల్యే స్వయంగా వాటిని నడిపారు. ఈ కార్యక్రమంలో నగరి పుత్తూరు మెడికల్ ఆఫీసర్లు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ముఖ్య నాయకులు, శ్రీసిటీ హీరో మోటార్స్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. తన విజ్ఞప్తి మేరకు బైక్ అంబులెన్స్‌లు అందజేసినందుకు హీరో మోటార్స్‌కు ఎమ్మెల్యే రోజా ధన్యవాదాలు తెలిపారు .

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/