ఏసీబీ కోర్టులో చంద్రబాబు మరో పిటీషన్‌..

chandrababu-naidu-arrest-latest-updates

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిబిఐ చంద్రబాబు ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబు కు బెయిల్ తీసుకరావడం కోసం లాయర్లు ట్రై చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బెయిల్ ఫై ఈరోజు ఏసీబీ కోర్ట్ లో విచారణ చేయనున్నారు. ఇదిలా ఉండగానే కోర్ట్ లో మరో పిటిషన్ దాఖలు చేసారు చంద్రబాబు తరుపు లాయర్లు. పిటిషన్ లో చంద్రబాబు పేర్కొన్న అంశాలు పరిశీలిస్తే.. నా పాత్రపై ప్రాథమిక ఆధారాలు లేకపోయినా సీఐడీ కేసు నమోదు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో నా పేరు లేదని వెల్లడించారు. రాజకీయ ప్రతీకారంతో ఈ కేసులో నన్ను లాగారని .. ప్రధాన బెయిల్ పిటిషన్ తేలేలోపు మధ్యంతర బెయిల్ ఇవ్వండని.. కేసు నమోదు చేసిన 22 నెలల తర్వాత నాపై ఆరోపణలు మళ్లీ తెర మీదకు తెచ్చి సీఐడీ కేసు పెట్టిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ఆమోదం లేకుండా నా పేరు FIR లో చేర్చటం, దర్యాప్తు, అరెస్ట్ చేయటం చట్ట విరుద్ధం అంటూ మండిపడ్డారు. బెయిల్ ఇవ్వటానికి ఈ ఒక్క కారణం సరిపోతుందని…తప్పుడు కేసు అయినా..దర్యాప్తుకు సహకరించటానికి సిద్దంగా ఉన్నానన్నారు.